Advertisements

ముస్లింలపై కుట్రలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు:వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూమ్..

ముస్లింలపై కుట్రలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు:వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూమ్..
మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే బిజెపి ప్రధాన అజెండా:జి.జలీల్ గూడూరు నియోజకవర్గ వైసిపి మైనారిటీ అధ్యక్షుడు..
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగం పై దాడి:షేక్ కాలేషా గూడూరు నియోజకవర్గ వైసిపి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు..
ఫోటో రైటప్: మాట్లాడుతున్న మైనార్టీ నాయకులు..
గూడూరు: పట్టణంలోని వైసీపీ మైనార్టీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ నిన్నటి దినం భారతదేశానికి చీకటి రోజు అని బ్లాక్ డేగా అభివర్ణించారు బిజెపి గద్దెనెక్కినప్పటి నుండి ఇప్పటివరకు ముస్లింలపై కక్షపూరితమైనటువంటి నల్ల చట్టాలను ప్రవేశపెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఇప్పుడు అతి పెద్ద కుట్రకు తెర లేపిందని అందులో భాగమే వక్ఫ్ సవరణ చట్టం ఇది కేవలం సవరణ మాత్రమే కాదని యావత్ భారతదేశం లో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను వారి సానుభూతిపరులకు దారదత్తం చేయడం కోసం ఒక కుట్ర అని అన్నారు రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ఆర్టికల్ 25, 26 ను అపహస్యం చేస్తూ మతపరమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టి ఇతర మతాచారాలలో వేరొకరి ప్రమేయాన్ని ప్రవేశపెట్టి మా ఆస్తులను దోచుకునే ప్రయత్నం ఈ సవరణ చట్టమని అన్నారు ఇది ఇంతటితో ఆగదు ఇక రాబోయే రోజుల్లో ముస్లింల ఓటు హక్కు కూడా తీసివేసే ప్రయత్నం జరుగుతుందని భారత దేశం నుండి ముస్లింలను తరిమివేసే అతిపెద్ద కుట్రలో భాగమే ఈ వక్ఫ్ సవరణ చట్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మైనారిటీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు జి.జలీల్ మాట్లాడుతూ భారతదేశము అన్ని మతాల సంస్కృతుల సమ్మేళనమని మరి అలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కోసమే ఇలాంటి మత విద్వేషకరమైనటువంటి చట్టాలను ప్రవేశపెట్టి అన్నదమ్ముల్లా కలిసి ఉండేటటువంటి వారి మధ్య శత్రుత్వం పెంచుతుందని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.గూడూరు నియోజకవర్గ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు షేక్ కాలేషా మాట్లాడుతూ ఈ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం పై దాడిగా పేర్కొన్నారు గత 11 సంవత్సరాల నుండి ముస్లింల సమాధులపై సింహాసనాన్ని అధిరోహించి పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వం అంతటి ఆగకుండా మా సమాధులను సైతం కబ్జా చేసేందుకు ఒక కుట్రే ఈ సవరణ చట్టం అని మండిపడ్డారు ఇక రాబోయే రోజుల్లో మా బిడ్డలకు బడులు ఉండవు మాకు మసీదులు ఉండవు దర్గాలు ఉండవు చచ్చిపోతే పాతి పెట్టడానికి స్మశానాలు కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఈ మతోన్మాద పార్టీకి దీనికి వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ లాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు లేకపోతే మిమ్మల్ని సమాజం క్షమించదని అన్నారు ఈ వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మగ్దూమ్, కాలేషా, జలీల్, అల్తాఫ్, మస్తాన్ సాహెబ్,రఫీ,మస్తాన్ బాషా, అబ్దుల్లా, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment