Advertisements

క్రికెట్ బెట్టింగులు జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి.

క్రికెట్ బెట్టింగులు జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి.

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పందెం రాయుళ్లుపై ప్రత్యేక నిఘా.

బెట్టింగ్ ముఠాల కార్యకలాపాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.

క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు..

  • డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా..

అమరావతి: ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్. అమాయక ప్రజలను యువతను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారిని ప్రలోభ పెట్టి క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని డిజిపి హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వ్యక్తుల సమగ్ర సమాచారం పోలీస్ శాఖ వద్ద ఉందని అన్నారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలని, బెట్టింగుల వైపు ప్రజలు మొగ్గుచూపుకూడదని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Comment