
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు లో ఈ నెల 25 నుంచి 28 వ తేదీ జరుగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లు పై ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం లో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన ,డిఎస్పీ గీతా కుమారి ,ఆలయ ఈవో నవీన్ కుమార్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు…భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు… జాతర లో ఎటువంటి అసంఘీక కార్యకలాపాలు జరగకుండా పోలీసు నిఘా పెంచామని అన్నారు…అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
