
విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ కొనసాగించాలి..
ఫోటో రైటప్: మాట్లాడుతున్న మగ్దూమ్ మొహిద్దీన్..
గూడూరు: రాష్ట్రం లోని విజయవాడ నుండే పవిత్ర హజ్ యాత్రను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు గతంలో హజ్ యాత్రకు వెళ్ళేందుకు రాష్ట్రంలోని ముస్లింలు బెంగళూరు, హైదరాబాద్ చేరుకొని ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని దీనితో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ముస్లిం పెద్దలు తెలపడంతో 2023 లో విజయవాడ విమానాశ్రయం నుండి ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారన్నారు కానీ ఇప్పుడు 2025 కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా బాధాకరం అని ఇది ఎన్ డి ఏ ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమని అన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీని అమలు చేసి అండగా నిలవాలని కోరారు.