రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి..
వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్..
ఫోటో రైటప్: మాట్లాడుతున్న మగ్దూమ్
గూడూరు : దర్గా వీధిలోని వైసీపీ మైనారిటీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి మగ్దూమ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు ఈ బిల్లు వక్ఫ్ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమన్నారు ముస్లింల మతపరమైన హక్కులను హరిస్తూ వారి ఆస్తుల పై కబ్జా చేసే ప్రయత్నమని విమర్శించారు ఈ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వ్యతిరేకించి ముస్లింలకు అండగా నిలవాలని అన్నారు. భారతదేశంలో ఎప్పుడూ లేనివిధంగా బీజేపీ పరిపాలన లో అనేక నల్ల చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చి ముస్లింల పై విద్వేషాలను రగిలిస్తుందని ఇది ఎంతో కాలం కొనసాగదని అన్నారు, వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు.
