Advertisements

ఏ.పీ.ఎస్.ఆర్టీ.సీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ జయప్రదం చేయండి.రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.నారాయణ.

ఏ.పీ.ఎస్.ఆర్టీ.సీ.రిటైర్డ్ ఎంప్లాయిస్ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27వ తేదీన చలో విజయవాడ మహా ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పీ.ఎస్.ఆర్టీ.సీ కార్యాలయము ముందు ఎం. శేషయ్య రిటైర్డ్ ఎంప్లాయిస్ గూడూరు డివిజన్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమస్యలను వివరిస్తూ అనేకసార్లు వినతి పత్రాలు సమస్యలను వివరించడం జరిగిందని, రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయడం జరిగిందని, కొన్ని సమస్యలు పరిష్కారం అయినా అనేక పని సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని నెలలు – సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలకు పరిష్కారం లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, 01-01-2020 తరువాత అనేకమంది ఉద్యోగులు వివిధ కారణాల వలన ఉద్యోగ విరమణ చేసి ఉన్నారని, వీరిలో అనేక మందికి లీన్ ఎన్ క్యాష్ మెంట్ సొమ్ము, ఈనాటికీ అందలేదని, మరి కొంతమందికి గ్రాడ్యుటి తాలూకు సొమ్ములో కోత విధించారని, అలాగే మరి కొంతమందికి నెలవారి అందవలసిన పెన్షన్ సొమ్ము అందడం లేదని, 04-11-2022న, హయ్యర్ పెన్షన్ విధానంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని, కానీ ఈ తీర్పును అమలు చేయడానికి ఈ.పి.ఎఫ్.ఓ. అధికారులు సహకరించడం లేదని, అనేక ఇబ్బందులు పెడుతున్నారని, డిమాండ్ నోటీసులు సకాలంలో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడంలో జాప్యం వలన కానీ, ఇతర కారణాలవల్ల గాని అనేకమంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ అవకాశం కోల్పోవడం జరుగుతుందని, వీరందరికీ మరో అవకాశం కల్పించవలసిందిగా ఈ.పీ.ఎఫ్.ఓ.ను కోరుతున్నామని వారు తెలియజేశారు. జీవితాంతం ఉపయోగపడే విధంగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఫ్రీ ట్రావెలింగ్ కు అనుమతించాలని ముఖ్యంగా సూపర్ లగ్జరీ బస్సులలో కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ దారుడు మరణిస్తే నామినీగా ఉన్న అతని భార్యకు జీవితాంతం పెన్షన్ చెల్లించాలని, కానీ పుట్టిన తేదీల్లో మార్పు జరిగిందని, పేరుతో కొన్ని అక్షరాలు తేడా ఉన్నాయని అనేక కారణాలు చెప్పి ఆమెకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని, అందువలన నిబంధనలను సులభతరం చేసి ఆర్టీసీ రికార్డులను ఆధారం చేసుకుని పెన్షన్ చెల్లించే ఏర్పాటు చేయవలసిందిగా వారు కోరడం జరిగింది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగికి నెలకు రూ.1000/- నుండి గరిష్టంగా రూ.2,500/- లు మాత్రమే నెలవారి పెన్షన్ వస్తుందని, ఉద్యోగి సర్వీస్ లో ఉన్న సమయంలో తమ వేతనాల నుండి ఈ.పి.ఎస్.-95 స్కీం నిమిత్తం కొంతమంది సొమ్ము మినహాయించుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ ఇస్తున్నారని, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగికి నెలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నందువలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్ వగైరా పథకాలు వర్తించే విధంగా ఏ.పీ.ఎస్.ఆర్టీ.సీ. వి.సి. అండ్ యం.డి గారు చేసుకొని తగిన ప్రయత్నం చేయాలని వారు కోరడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రులలో ఇద్దరు డాక్టర్లు నియమించాలని మగ డాక్టర్, లేడీ డాక్టర్, కచ్చితంగా ఉండాలని, రోగులకు అన్ని రకాల మందులు ఆర్టీసీ డిస్పెన్షరీల్లో ఇవ్వాలని పై సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 27-03-2025 గురువారం విజయవాడ – వి.సి. అండ్ యం.డి. కార్యాలయం వద్ద జరుగుచున్న మహాప్రదర్శనలో ఆర్టీసీలో రిటైర్డ్ అయిన సోదర, సోదరీమణులు, మరియు సర్వీసులో ఉన్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాప్రదర్శన జయప్రదం చేయాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.వి.రమణయ్య రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు, ఎం. శేషయ్య రిటైర్డ్ ఎంప్లాయిస్ గూడూరు డివిజన్ యూనియన్ నాయకులు, వై.హరినాథ్ ట్రెజరర్,ఎస్.రత్నయ్య, ఏ. రాజారాం, ఈ.జయచంద్ర, సి.హెచ్.గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు విజయలక్ష్మి, తిరుపతమ్మ, బి.రామమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment