https://youtube.com/shorts/YlnLKnNhVAk?si=9z9LTdki1m_SQ-7C
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుగ్గరాజుపట్నం సముద్ర ముఖద్వారం గురించి.రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తిరుపతి జిల్లా,గూడూరు నియోజవర్గం,వాకాడు మండలం,దుగ్గరాజపట్నం పంచాయితీకి సంబంధించి 8 (సమీప గ్రామాలు) అంజలాపురం,దుగ్గరాజుపట్నం కాకివాకం,కొండూరుపాలెం, కొత్తూరు,పులింజురీవారిపాలెం శ్రీనివాసపురం,శ్రీనివాసపురం మిట్ట ఉన్నవి.ఇవన్నీ మత్స్యకారు గ్రామాలే.ఇక్కడ ప్రజలు మొత్తం చేపల వేట మీద ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నారని అన్నారు.ఈ వాకాడు మండలానికి సంబంధించి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పులికాట్ బర్డ్ శాంక్చురీ వల్ల అనేక ఆంక్షలు ఉంటాయి.కావున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే పర్యావరణ మరియు అటవీశాఖ నుంచి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయిని తెలిపారు.గతంలో 1997 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా తండ్రి ఇదే గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.మనపాలెం వద్ద హై లెవెల్ కెనాల్ ఉప్పుటేరు మీద నిర్మించుటకు షార్ మరియు అటవీ శాఖ నుంచి అనేక ఆంక్షలు ఎదురయ్యాయి.అయినా సరే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మనపాలెం వద్ద హైలెవెల్ కెనాల్ నిర్మించడం జరిగిందని, రోజుటికి ఈ హైలెవెల్ కెనాల్ వల్ల 8 గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఏర్పడిందని తెలిపారు.పులికాట్ సరస్సుకి సంబంధించి బంగాళాఖాతంలో మూడు సముద్ర ముఖద్వారాలు ఉన్నవి.అందులో వాకాడు మండలంకి సంబంధించి పూడిరాయదొరువు,తూపిలిపాలెం మరియు తమిళనాడులోని పులికాట్ గ్రామం,ఉత్తర దిశ గాలి వల్ల ఈ ముఖద్వారాలు ఎప్పుడు ఇసుక మేటలతో మూసి వేయబడుతుంది.ఈ ఇసుక మేట ద్వారా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయిని అన్నారు.
కావున కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పూడిరాయదొరువు ముఖద్వారం పూడికతీతకు 97 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నది.అలాగే దుగ్గరాజపట్నం పంచాయితీకి సంబంధించి సముద్ర ముఖద్వారంకు కూడా బడ్జెట్ కేటాయించి అక్కడ ఉన్న* *వేల మంది మత్స్యకార కుటుంబాలకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చి వారి కుటుంబాలలో ఆనందోత్సవాలు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఎమ్మెల్సీ తెలియజేశారు
