
సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగముగా తేది.16.03.2025న (ఆదివారం) తెల్లవారుజామున గూడూరు పురపాలక సంఘ పరిధిలో గల చికెన్ మరియు మటన్ దుకాణాలపై కమీషనరు, గూడూరు పురపాలక సంఘ వారు మరియు మునిసిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగినది.
- చికెన్ మరియు మటన్ దుకాణాల యందు పరిశుభ్రమైన చికెన్ మరియు మటన్ అమ్ముచున్నారా లేదా అనియూ, ఫ్రీజర్ నందు చికెన్ మరియు మటన్ మాంసమును నిల్వ చేయుచుచున్నారా లేదా అని తనిఖీలు చేయడం జరిగినది. సదరు తనిఖీలలో భాగముగా రెండు ఫ్రీజ్ చేసిన పొట్టేలు తలలను డిస్పోస్ చేయడం జరిగినది.
- వీటితో పాటుగా, చికెన్ మరియు మటన్ మాంసమును ఎటువంటి కవర్లలో ప్యాకింగ్ చేయుచున్నారు అని తనిఖీ చేసి, పేపరు మరియు అరటి ఆకులలో మాంసమును ప్యాక్ చేసి అమ్మవలసినదిగా ఆదేశాలు జారీ చేసినారు.
- ఇకపై, అపరిశుభ్ర వాతావరనములో మాంసమును అమ్మినా, ప్లాస్టిక్ కవర్ల యందు మాంసమును అమ్మినా, ఫ్రీజర్ నందు నిల్వ ఉంచిన మాంసమును అమ్మినా సదరు దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకొనబడతాయని తెలియజేసినారు.

