
వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడుగా షేక్ కాలేషా ఎంపికయ్యారు. శనివారం గూడూరు రెండవ పట్టణంలోని చింపిరినాయుడుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ అభిమానించేవారిలో తాను ముందువరుసలో ఉంటానన్నారు. అలాగే వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. నియోజకవర్గ గ్రీవెన్ సెల్ అధ్యక్షునిగా పదవి కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.