
తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్.
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ బాలిక ఏడుస్తూ ఉండడంతో గమనించిన అక్కడ స్థానికులు ఆ పాప వివరాలు అడగక నా పేరు గాయత్రి నేను 6 క్లాస్ మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్నానని చెప్పింది ఇక్కడికి ఎలా వచ్చావని ఎవరు తీసుకొచ్చారని అడగక ఆటోలో వచ్చానని చెప్పింది తల్లిదండ్రుల పేర్లు అడగక తెలియదని సమాధానం ఇచ్చింది ఎంతసేపటికి తల్లిదండ్రుల పేర్లు చెప్పకపోవడంతో స్థానికులు రూరల్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా స్పందించిన ఎస్సై మనోజ్ కుమార్ వారి సిబ్బందిని పంపించి పాప వివరాలు తెలుసుకొని పాపని వారి కుటుంబ సభ్యుల అయినా బాబాయి, చిన్నమ్మ అయినా వెంకటేశు,లక్ష్మీప్రసన్నలతో దిగువ వీరారెడ్డిపల్లి హరిజనవాడ లో ఉన్న వారి వద్దకు చేర్చడం జరిగింది. సకాలంలో పాపని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన ఎస్సై మనోజ్ కుమార్ ను మరియు వారి సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు.
