Advertisements

జ‌నసేన ఆవిర్భావం.. ప‌వ‌న్ ప్ర‌సంగం

జ‌నసేన ఆవిర్భావం.. ప‌వ‌న్ ప్ర‌సంగం : జ‌య‌కేత‌న స‌భ.. గోదావ‌రి తీరం.. పిఠాపురం నియోజక‌వ‌ర్గం, చిత్రాడ దారుల‌లో..

జ‌న‌సేన ఆవిర్భావం : క‌వితాత్మ‌క ధోర‌ణిలో అత్యంత భావోద్వేగ రీతిలో మాట్లాడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్. తెలంగాణ క‌వి దాశ‌ర‌థిని స్మ‌రించిన వైనం. జ‌న్మ స్థ‌లం తెలంగాణ క‌ర్మ స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్. కార్య‌కర్త‌ల‌లో ఉత్సాహం నింపుతున్న వైనం. గుండెలోతుల్లోంచి ధ‌న్య‌వాదాలు అని చెప్పిన ప‌వ‌న్.
జన‌సేన ఆవిర్భావం : తెలంగాణ నేల త‌ల్లికి హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు. నాకు పున‌ర్జ‌న్మ‌నిచ్చిన నేల. కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి న‌న్ను కాపాడాడు. : ప‌వ‌న్
జ‌నసేన ఆవిర్భావం : దివంగ‌త ప్రజా క‌వి , తెలంగాణ ఉద్యమ కారుడు గ‌ద్ద‌ర్ ను ప‌వ‌న్ స్మ‌రించిన వైనం.
జ‌న‌సేన ఆవిర్భావం : వీర మ‌హిళ‌ల‌కు జేజేలు ప‌లికిన ప‌వ‌న్
జ‌న‌సేన ఆవిర్భావం : జ‌య‌కేత‌నం (ఆవిర్భావ స‌భ) రోజున హోలీ రావడం యాదృశ్చికం కాదు భ‌గ‌వంతుని నిర్ణ‌యం. దేశ ప్ర‌జ‌ల‌కు హిందీలో శుభాకాంక్ష‌లు చెప్పిన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : త‌మిళ‌నాడు నుంచి నాకెంతో ప్రేమ ఇచ్చారు. సుబ్ర‌హ్మ‌ణ్య భార‌తీయార్ స్ఫూర్తిని నింపుకున్నాను. కొన్ని మాట‌లు త‌మిళంలో మాట్లాడి.. ఆక‌ట్టుకున్నారు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : మ‌హారాష్ట్ర నేల‌కు వంద‌నాలు చెప్పిన వైనం. అక్క‌డ కూడా ప్ర‌చారం చేశాను. 90శాతంకు పైగా సానుకూల ఫ‌లితాలు అందుకున్నాను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : మ‌రాఠా వీరుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీని, ఆయన కుమారుడు శంభాజీని స్మ‌రించారు. మ‌రాఠీ భాష‌లో మాట్లాడారు. అలానే క‌న్న‌డ నాట నుంచి వ‌చ్చిన సోద‌రుల‌ను వారి భాష‌లో ( క‌న్న‌డ భాష‌లో) మాట్లాడి ఆక‌ట్టుకున్నారు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : భార‌త దేశానికి కావాల్సింది బ‌హు భాష‌లు అంటూ ఇంగ్లిషులో మాట్లాడి ఆక‌ట్టుకున్న వైనం. బ‌హుభాషే భార‌త‌దేశానికి మంచిది. బోలో భార‌త్ మాతాకీ జై అంటూ నినందించిన వైనం.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : సినిమాల ప్ర‌స్తావ‌న వ‌ద్దు. ప్రాణాల‌కు తెగించిన వారు ఇక్క‌డ ఉన్నారు. అందుక‌ని ఇక్క‌డ సినిమాల గురించి మాట్లాడ‌కూడ‌దు. నాలుగు వంద‌ల యాభై మంది సైనికులు సినిమాల కోసం కాదు జ‌న‌సేనసిద్ధాంతం కోసం చ‌నిపోయారు. వారి గౌర‌వం కోసం సినిమాల కోసం మాట్లాడకూడ‌దు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : నా ఓట‌ముల్లోనూ గెలుపుల్లోనూ మీరు న‌న్ను గుండెల్లో పెట్టుకున్నారు. ప‌ద‌కొండేళ్ల ప్ర‌స్థానంలో మీరంతా తోడుగా ఉన్నారు అని కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. సినిమాల‌ను నేను దృష్టిలో ఉంచుకుని నేను ఎద‌గ‌లేదు. నేను స‌మాజాన్నీ దేశాన్నీ దృష్టిలో ఉంచుకుని ఎదిగాను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : నువ్వు దేశం కోసం.. ప‌నిచేసేవాడివి అని ఖుషి సినిమా చూసి వ‌చ్చి గ‌ద్ద‌ర్ ప్ర‌శంసించారు. అలానే నేను 2006లో పుస్త‌కాలు చదువుతూ సినిమాలు చేశాను. అందుకే ఆ స‌మ‌యంలో నేను చేసిన నా సినిమాలు మీకు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. త‌రువాత ఒక ప్రొఫెస‌ర్ నాకు తోడుగా ఉన్నారు. హైద్రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ శ్రీ‌ప‌తి రాముడు స్ఫూర్తితో నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : పారిశుద్ధ్య సిబ్బందికి హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. దారి పొడ‌వునా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన కార్య‌క‌ర్త‌ల‌కూ నాయ‌కుల‌కూ ధ‌న్య‌వాదాలు. సెక్యూరిటీ సిబ్బందికి నా ధ‌న్య‌వాదాలు. డిప్యూటీ సీఎం పేషీలో ప‌నిచేస్తున్న సిబ్బందికి నా ధ‌న్య‌వాదాలు. నాదెండ్ల‌కూ ధ‌న్య‌వాదాలు చెప్పిన ప‌వ‌న్.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ఎమ్మెల్సీ హ‌రి ప్ర‌సాద్ కు ధ‌న్య‌వాదాలు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : బీజేపీ టీడీపీ నాయ‌కుల‌కూ, కార్య‌క‌ర్త‌ల‌కూ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ఇది 11 వ సంవ‌త్స‌రాలు పూర్తి చేశాం. 11ను ఆ..11కు అంకింతం చేశాం.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : పోలీస్ శాఖ‌కు ధ‌న్య‌వాదాలు. వారికి స్వ‌యం నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఉండ‌దు. వారికి డ్యూటీయే ఉంటుంది.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : నా ఇష్టం నా కోరిక ఎప్పుడూ స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నిషిగా ఉండ‌ట‌మే.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : మా నాన్న కోరిక మాత్రం నేను డిగ్రీ చదివి ఎస్సై కావాల‌ని అనుకునేవారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ నేను డిగ్రీ చేయ‌లేక‌పోయాను. పేరు సంపాదించాలి కోట్లు సంపాదించాలి అని ఏ రోజూ నెల్లూరులో ఉన్న‌ప్పుడు అనుకోలేదు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : చిన్న‌తంబి సినిమాలో హీరోయిన్ మాదిరిగా నన్ను ఇంట్లో పెంచారు. అంత సున్నితంగా న‌న్ను పెంచారు. నేను ఆస్త‌మా పేషెంట్ ను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఏ రోజూ అనుకోలేదు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ఇదంతా భ‌గ‌వంతుడి మాయ త‌ప్ప నాది కాదు. పార్టీ పెట్టాల‌న్న భావ‌న ఇచ్చింది నాలోని భావ తీవ్ర‌త‌.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : క‌ర్మే చేస్తాను ఫ‌లితం ఆశించ‌ను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : భిన్న‌మ‌యిన వ్య‌క్తుల‌లో ఏక‌త్వం చూడ‌గలిగాను క‌నుక పార్టీ కోసం ఏడు సిద్ధాంతాల‌ను రూపొందించ‌గ‌లిగా ను. ఈ ఏడు సిద్ధాంతాలే మొన్న‌టి ఎన్నిక‌ల‌లో హండ్రెడ్ ప‌ర్సంట్ స్టైకింగ్ రేట్ కు కార‌ణం అయింది.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : సామాజిక అవ‌గాన ఉన్న‌వాణ్ని క‌నుక‌నే పార్టీ పెట్టాను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ప‌వ‌న్ ప్ర‌సంగంలో జ‌గ‌న్ పై చెణ‌కులు. పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్య‌మంత్రి అయి ఉండాలా ?
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : రిజిస్ట‌ర్డ్ పార్టీ టు రిక‌గ్నైజ్డ్ పార్టీ గా జ‌న‌సేన జ‌యకేత‌నం ఎగుర‌వేస్తోంది.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు నేను వ‌చ్చాను. న‌న్ను నేను కాపాడుకునేందుకు కాదు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : మార్పు చాలా స‌హ‌జం ఎద‌గ‌డానికి అయినా దిగ‌జార‌డానికి అయినా.. మార్పు తెచ్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. నా సిద్ధాంతాలు చూసి చాలా మంది న‌వ్వారు. సిద్ధాంతాలు ప్ర‌తిపాదించే స‌మ‌యంలో చరిత్ర చ‌ద‌వాలి. చ‌దివేను. ఎంతో ఆలోచించి అడుగులు ముందుకు వేశాను. ఈ ప‌ద‌కొండేళ్ల‌లో నిల‌బ‌డ్డాం బ‌ల‌ప‌డ్డాం చాలా ప‌డ్డాం కూడా !
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : కోపం లేని స‌మాజంలో మార్పు ఎలా వ‌స్తుంది. ఒక్క‌డికి మార్పు వ‌స్తే ఇంత మార్పు వ‌చ్చింది. ఇన్ని ల‌క్ష‌ల మందికి కోపం వ‌స్తే ఏంట‌న్న‌ది మీరు చూపించాలి. నిరూపించాలి. (కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశిస్తూ..)
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : భవిష్య‌త్తును నిర్దేశించే స‌మ‌యంలో ద‌శాబ్ద కాలం త‌రువాత వ‌చ్చింది. ఇప్పుడు దిశా నిర్దేశం చేయాలి. అంతా జాగ్ర‌త్త‌గా ఉండండి. బాధ్య‌త‌గా ఉండే వాళ్లు నా కార్య‌క‌ర్త‌లు అయి ఉండాలి. అల్ల‌రి చిల్ల‌రిగా ఉండేవాళ్లు వ‌ద్దు. అరుపులు వద్దు. వినండి నేను చెప్పే మాట‌లు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : స‌రికొత్త నాయ‌క‌త్వం రావాలి. ప్ర‌తి ప‌ల్లె నుంచి వంద మంది నాయ‌కులు రావాలి. అదే నా ల‌క్ష్యం.. నా స్వ‌ప్నం. ఎలా ఉండాలి అంటే విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం రాకూడ‌దు. ఆంధ్రా, తెలంగాణ నుంచి దేశాన్ని ప్ర‌భావితం చేసే వంద మంది యువ నాయ‌కుల‌ను త‌యారు చేయాలి. అదే నా ల‌క్ష్యం. దాని కోసం ప‌నిచేయాలి మ‌నంద‌రం.

జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ఒక త‌ప్పును త‌ప్పుగానే చెబుదాం.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : రాముడ్ని ఆరాధించు అల్లాని గౌర‌వించు
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : జానీ టైటిల్ సాంగ్ ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్. ప్ర‌జాక‌వి మాస్టార్జీ పాట ఇది. నా రాజు గాకురు మా అన్న‌య్యా.. అనే ప‌ల్ల‌వితో సాగే పాట ఇది. గుజ‌రాత్ అల్ల‌ర్లు (మార‌ణ‌హోమం) జ‌రిగిన‌ప్పుడు ఖండించాలి.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : నేను భార‌త దేశం కోసం చ‌నిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు చెప్పిన వైనం. హిందువులంతా ముస్లింల‌ను చూసి నేర్చుకోవాలి.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : భార‌త దేశాన్ని విధ్వంసం చేయాల‌నుకుంటే నాలాంటి వాళ్లు ప‌ది కోట్ల మంది ముందుకు వ‌స్తారు. నార్త్ ., సౌత్ అంటూ మాట్లాడితే చాలు విద్వేష‌పు ప్ర‌సంగాలు చేస్తారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా ఇలానే చాలా మంది నాయ‌కులు మాట్లాడారు. భాష వేరు భావం వేరు అన్న‌వి చెల్ల‌వు.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : వైరుధ్యం వ‌స్తే వేర్పాటు వాదం కాదు ప‌రిష్కారం కోసం అందరం క‌లిసి మాట్లాడుకోవాలి.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : విధ్వంసం తేలిక నిర్మాణం క‌ష్టం.
జ‌న‌సేన ఆవిర్భావం ప‌వ‌న్ ప్ర‌సంగం : మీరే నా బంధం మీరే నా అనుబంధం.. (కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి) .. చాలా బాధ్య‌త‌గా ముందుకు వెళ్దాం.
జ‌న‌సేన ఆవిర్భావం..ప‌వ‌న్ ప్ర‌సంగం : మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌ని స్మ‌రిస్తూ ప్ర‌సంగం ముగించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. య‌ముని మ‌హిష‌పు లోహ ఘంట‌లు మ‌బ్బు చాటున క‌ర్మేల‌న్నాయి… అంటూ శ్రీ‌శ్రీ క‌విత్వాన్ని స్మ‌రించిన ప‌వ‌న్. జాతీయ గీతాలాప‌న‌తో ముగిసిన స‌భ‌. జై హింద్.

Leave a Comment