
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి లో గంజాయి చాక్లెట్ల పట్టివేత
- ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్స్ ను అమ్ముతున్నాడనే సమాచారంతో మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆకస్మిక దాడి .
- 84 గంజాయి చాక్లెట్లు ( 465 గ్రాముల) స్వాధీనం,
- బీహార్ రాష్ట్రానికి చెందిన నితీశ్ కుమార్ (25) ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు.
- నిందితుడు ORR పక్కన ఉన్న సిల్వర్ బావర్చి హోటల్ లో రాత్రి వేళ వాచ్ మెన్ గా పనిచేస్తూ బీహార్ లో తక్కువ ధరకు చాక్లెట్లు కొనుగోలు చేసి ఇక్కడ వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు వెల్లడించిన అధికారులు.