
ప్రతి ఆడబిడ్డ ఎక్కువ మంది పిల్లలను కనాలి: CBN
AP: బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతీ కపుల్, ప్రతీ ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. దీనిపై రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండలం, జిల్లాల్లో మానిటర్ చేయనున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ ప్రభావం పడనుండటంతో చంద్రబాబుతో పాటు తమిళనాడు సీఎం కూడా పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నారు.