Advertisements

సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉందిఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్

సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది
ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్

ముస్లింలు రాజకీయంగా ఎదగాలి : నాశిన భాస్కర్ గౌడ్

సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలి : కడివేటి చంద్రశేఖర్

మే 3న ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : షేక్. రియాజ్ అహ్మద్

కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే దేశంలో పేదరికం : షేక్ జమాలుల్లా

సృష్టి అంతమయ్యే వరకూ సేవా కార్యక్రమాలు : షఫీ మౌలానా

సేవాతత్పరులతో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది : ఎండీ. అన్వర్ బాష

ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మందికి చీరల పంపిణీ

గూడూరు:
కోట్ల రూపాయల సంపాదనలో లేని సంతృప్తి నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉంటుందని ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్ధూమ్ మొహిద్దీన్ అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత పదహారేళ్లుగా రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ సేవా థృక్పధాన్ని కలిగి ఉండాలన్నారు. దర్గా వెల్ఫెర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మగ్థూమ్ కు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని అన్నారు. మే 3న నిర్వహించనున్న ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఎస్పీ సీనియర్ నాయకులు నాశిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ముస్లింలు రాజకీయాల్లోకి రావాలన్నారు. దామాషా ప్రకారం సీట్లు కేటాయించే పార్టీలకే ప్రజలు గెలిపించాలని కోరారు. ఇన్సాఫ్ సమితి సలహాదారులు ఎండీ. అన్వర్ బాష మాట్లాడుతూ సేవాతత్పరులతో వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మత గురువు మౌలానా షఫీ మాట్లాడుతూ హిందూ, ముస్లిం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో యుగాంతం వరకూ సేవా కార్యక్రమాలు కొనసాగాలని కుల, మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ దేశంలో పేదరికం ఎంత పెరిగిపోయిందనే విషయాన్ని ఈ కార్యక్రమంతో అర్థం చేసుకోవచ్చన్నారు. వెయ్యిమందికి పైగా మహిళలు చీరల కోసం వచ్చారన్నారు. కేంద్ర పాలకుల విధానాలతో దేశంలో పేదరికం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ధనికులు కోట్లకు పడగలెత్తుతుంటే పేదలు రెండు పూటలా తిండి లభించక అల్లాడుతున్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర కార్యక్రమాన్ని పదహారేళ్లుగా నిర్వహిస్తున్న ట్రస్ట్ ఫౌండర్ మగ్ధూమ్ సేవలను కొనియాడారు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలలో నిరుపేదల శాతం అధికంగా ఉందన్నారు. తమ సంస్థ తరపున రంజాన్ మాసంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుస్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంఎఫ్ ట్రస్ట్ మాదిరిగా యువత సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని కోరారు. ఈద్గా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షబ్బీర్ మాట్లాడుతూ ఎం ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు నిస్వార్థ సేవ అందరూ సమానమే అనే నినాదంతో గత 16 సంవత్సరాలు నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రం అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యమంలో సన్మాన గ్రహీతలు
షేక్ రియాజ్ అహ్మద్,
నాసిన భాస్కర్ గౌడ్,
హారున్ రషీద్ హజరత్,
షేక్ జమాలుల్లా,
కడివేటి చంద్ర శేఖర్,
మొహమ్మద్ బాసిత్
షేక్ షబ్బీర్,
ఎండి అన్వర్ భాయ్
షేక్ అబ్రారుల్ హక్,
షఫీ మౌలానా,
ఎల్ వి సుబ్బయ్య,
షేక్ మహబూబ్ బాషా,
షేక్ షంశుద్దీన్
షేక్ అన్వర్ బాష
సయ్యద్ మస్తాన్ బాషా
షేక్ యస్దాని
షేక్ నజీమ్
షేక్ మస్తాన్ సాహెబ్
ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మొహమ్మద్ అమృద్దీన్, గౌరవ అధ్యక్షురాలు మొహమ్మద్ ఫరీనా, సలీం, బాబు, అర్షద్, జమీర్, కాలేషా, కరీముల్లా, గయాజ్, గోల్డ్ నాజర్, ఇబ్రహీం, మున్నా తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This