Advertisements

వర్మకు లేని బాధ వైసీపీకెందుకు?

వర్మకు లేని బాధ వైసీపీకెందుకు?

తెలుగుదేశం పార్టీ పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని వైసీపీ తెగ బాధ పడిపోతోంది. ఆయనకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు తమ వైసీపీ క్యాడర్ అంతా పోలోమంటూ జనసేన పార్టీలో చేరుతూంటే ఒక్క కార్యకర్తను కూడా ఆపుకోలేని దుస్థితిలో ఉన్న వైసీపీ.. టీడీపీ నేత వర్మపై సానుభూతి చూపిస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆయన అసంతృప్తికి గురయ్యారని.. అసహనం చెందుతున్నారని అదే పనిగా ప్రచారం చేశారు. తీరా ఆయన మీడియా ముందుకు వచ్చి తేలికగా తీసుకున్నారు. పదవులు ఇవాళ కాకపోతే రేపు వస్తాయని.. పిఠాపురం ప్రజలకు సేవ చేయడమే తనకు పెద్దవి అన్నారు వైసీపీ నేతలు ఆయనపై సానుభూతి చూపిస్తున్నట్లు గా నటించడమే కాదు.. ఆయనకు పదవి ఇవ్వకపోవడానికి జనసేన పార్టీ కారణం అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని అందుకే జనసేన అడ్డుకుందని ప్రచారం చేయడం ప్రారంభించారు.

అయితే జనసేన పార్టీ మాత్రం అలాంటి ప్రచారాన్ని ఖండించారు. వర్మకు పదవి ఇవ్వకపోవడం అనేది టీడీపీ అంతర్గత వ్యవహారమని.. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో టీడీపీ ఎలా జోక్యం చేసుకోదో.. తాము కూడా జోక్యం చేసుకోబోమన్నారు. అయితే వర్మ అంటే తమకూ అభిమానమేనన్నారు. ఆయనంటే గౌరవం ఉందంటున్నారు. ఆయనకూ పదవి రావాలని తాము కోరుకుంటాం కానీ.. ఎందుకు అడ్డుకుంటామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వర్మకు లేని బాధ.. వైసీపీకి కనిపిస్తోంది. రేపు వైసీపీ వాళ్లు రాజీనామా చేసే స్థానంలో వర్మను ఎమ్మెల్సీగా చేస్తే అప్పుడు ఆ పార్టీకి గట్టి షాక్ తగులుతుందమో ?

Leave a Comment