
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో పోలీసులు పిటి వారెంట్పై నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జామీన్ కింద ఇద్దరిని, రూ. 10 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది నవంబర్లో నరసరావుపేట రెండో పట్టణ పీఎస్లో పోసానిపై కేసు నమోదు అయ్యింది.