
రాజకీయాల్లోనూ ‘పవన్’ పవర్ స్టారే!
AP: కూటమి సర్కారు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకత చాటుకుంటున్నారు. అన్న నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్.. ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించుకోవడంతోనూ కీలకంగా వ్యవహరించారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టారే అని జనసైనికులు కొనియాడుతున్నారు.