
సేవతోనే సంతృప్తి మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేసిన ట్రస్ట్ ప్రతినిధులు
గూడూరు: గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్నటువంటి 70 మంది నిరుపేద మహిళలకు ఆదివారం ఉదయం మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటన్ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దిన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ మాసంలో రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని నిరుపేద నిరాశ్రయులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని ఇది 16వ సంవత్సరము అని అన్నారు ముందుగా చర్చి వీధి పాత బస్టాండు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు దుస్తులు పంపిణీ చేయడం ఆనవాయితీ అని అలాగే షాదీ మంజిల్లో 12 వ తేది బుధవారం ఉదయం 9 గంటలకు 786 దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పటికే టోకెన్లను పంపిణీ చేసి ఉన్నామని టోకెన్లు తీసుకోని వారు మా సంస్థ ప్రతినిధులను గాని లేదా నేరుగా కార్యక్రమం జరిగే రోజున ఉదయం 8 గంటలకు షాది మంజిల్ వద్దకు వస్తే టోకెన్లు తీసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమం లోనే సమాజ సేవలో భాగస్వాములైనటువంటి వారిని సేవా గుణం కలిగినటువంటి వారిని సత్కరించబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు,మొహమ్మద్ అన్వర్ భాయ్ మాట్లాడుతూ గత 16 సంవత్సరముల నుండి ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో నేను కూడా హాజరవుతూ రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుందని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని ముందుగా నిరుపేద నిరాశ్రయులైనటువంటి దివ్యాంగులకు వృద్ధులకు చర్చి వీధి కాంపౌండ్ నందు చీరలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్, సంస్థ ప్రతినిధులు మొహమ్మద్ అన్వర్ భాయ్,షేక్ అబ్దుల్ రెహమాన్, కరిముల్లా, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
