Advertisements

పోలీసులు కార్డెన్ సెర్చ్.సుమారు 130 ఇళ్ళ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

తిరుపతి జిల్లా…గూడూరు*
గూడూరు వన్ టవున్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆరుందతీయ వాడ లో పోలీసులు కార్డెన్ సెర్చ్.సుమారు 130 ఇళ్ళ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు ఎటువంటి ధ్రువ పత్రాలు లేని 13 బైక్ లు స్వాదీనం.అనుక్షణం పోలీసు నిఘా కొనసాగుతుంది,చట్టాలను అతిక్రమించవద్దు శిక్షలకు గురికావద్దు అంటున్న పోలీసులు.నేరాలకు దూరంగా వుండండి,సంతోషంగా జీవించండి అంటున్న పోలీసులు కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న గూడూరు వన్ టవున్ సిఐ శేఖర్ బాబు, ఒన్ టవున్ ఎస్సై తిరుపతయ్య,వెంకయ్య,2 టవున్ ఎస్సై మరియు పోలీసు సిబ్బంది

నేర నియంత్రణ లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు మేరకు గూడూరు DSP గీతా కుమారి సూచనల తో తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఒన్ టవున్ పోలీసు స్టేషన్ పరిది లోని ఆరుందతీయ వాడ లో  వన్ టవున్ సిఐ శేఖర్ బాబు ఆద్వర్యం లో ఒన్ టవున్ ఎస్సై లు తిరుపతయ్య, వెంకయ్య,2 టవున్ ఎస్సై మరియు పోలీసు సిబ్బంది తెల్లవారు ఝామున  కార్డెన్ సెర్చ్ నిర్వహించారు,ఈ కార్డెన్ సెర్చ్ లో సుమారు 130 ఇళ్ళ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొందరి వద్ద ఎటువంటి ధ్రువ పత్రాలు లేని 13 బైక్ లును గుర్తించి వాటిని స్వాదీనం చేసుకున్నారు …మత్తు పదార్థాలు వాడడం,రవాణా చేయడం,కలిగి వుండడం నేరమని,ఇదే సమయంలో నేర ప్రవృత్తి తో జీవితాలు నాశనం చేసుకోవద్దని,సమాజంలో శాంతి యుతంగా జీవించాలని చట్టాలను ఎవరైనా అతిక్రమించితే కఠినంగా శిక్షలు వుంటాయని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వుంటారని పోలీసులు తెలియచేసారు .

Leave a Comment