మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరని పర్మినెంట్ చేయాలి.సి.ఐ.టి.యు డిమాండ్..

మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంటాక్ట్,ఔట్ సోర్సింగ్,ఎన్.యం.ఆర్ కార్మికులందరినీ, దశలవారీగా పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కోరుతూ శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరులో ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీపరం రద్దుచేసి, ఆప్కాస్ అమలు చేయాలని, లేని పక్షంలో కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న పనిని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎ.ఓ.కె. శిరీష గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీనాథ్, గౌరవా ధ్యక్షులు జోగి.శివకుమార్,నాయకులు బి. వి.రమణయ్య,అడపాల ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వెంకటరమణ, పట్టణ కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, రాజేష్,గిరి,సంపూర్ణమ్మ, నారాయణమ్మ,పద్మమ్మ పెంచలమ్మ,తదితరులు పాల్గొన్నారు.
——————————-