Advertisements

నాయుడుపేట రైల్వే స్టేషన్ లో త్రాగునీటి కొరత

నాయుడుపేట రైల్వే స్టేషన్ లో త్రాగునీటి కొరత

వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ

నాయుడుపేట రైల్వే స్టేషన్లో త్రాగునీటి కొరత సమస్య తీవ్రంగా ఉందని ప్రయాణికుల నుండి అందిన విజ్ఞప్తులు, వార్తా కథనాల ద్వారా తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు.

చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలకు నాయుడుపేట రైల్వే స్టేషన్ ద్వారా సమీప గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తున్నారని తెలిపారు. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో త్రాగునీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు.

వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, తక్షణమే తగిన చర్యలు తీసుకుని త్రాగునీటి కొరత నివారించాల్సిందిగా ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. అదనపు వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న వాటిని సక్రమంగా నిర్వహించి, నిరంతర త్రాగునీటి సరఫరా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని లేఖ ద్వారా కోరారు.

Leave a Comment