Advertisements

P4 కాన్సెప్ట్ – చంద్రబాబు ఆలోచన అమలైతే పేదరిక నిర్మూలన

P4 కాన్సెప్ట్ – చంద్రబాబు ఆలోచన అమలైతే పేదరిక నిర్మూలన

చంద్రబాబునాయుడు P4 అనే విధానం గురించి ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నారు. దీన్ని ఉగాది నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. పీ4 (public philanthropic people participation) అంటే ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ – బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనుకోవచ్చు.

సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4 విధానం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు చెబుతున్నారు. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టు గా అధికారులు రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ది పొందుతాయి.

2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని, ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

లబ్దిదారుల ధృవీకరణ పూర్తి అయిన తర్వాత సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫామ్‌లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్…వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు….స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని చంద్రబాబు చెబుతున్నారు.

ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే.. ఏపీలో పేదరికం చాలా వరకూ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఉన్నతవర్గాలు పేదల అభ్యున్నతికి సహాయపడే కొత్త కాన్సెప్ట్ అవుతుంది.

Leave a Comment