
తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వాసు సునీల్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక సదుపాయాలతో వాకాడులోని అన్ని సదుపాయాలతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వాకాడు మండలంలో మూడు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేసామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధు రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు