Advertisements

మరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్

మరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్

హైదరాబాద్:ఫిబ్రవరి 27
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయ క చర్యలు నేటితో ఆరవ రోజు కొనసాగుతున్నాయి, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో నీటి తోడకము చాలెంజిగా మారింది నిమిషానికి 5వేల లీటర్ల సి పేజ్ నీటి తోడకం తో పాటు లోపల బురద కోరుకపోతుండడంతో రిస్కు పనులు మరింత క్లిష్టంగా మారాయి..

ఆర్మీ నేవీ,ఎన్ డి ఆర్ ఎఫ్,ఎస్ డి ఆర్ ఎఫ్,జి ఎస్ ఎల్, సింగరేణి, ర్యాట్ హోల్, పలు రిస్క్ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8మందిని బయటకు తెచ్చేందుకు రెండు రోజుల కార్యచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభు త్వం సిద్ధం చేసింది. రెస్క్యూ ఆపరే షన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషా లు, నీరు, బురద, పూడి కను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది.

సొరంగంలో చిక్కుకున్న 8మంది జాడను కనిపెట్ట డమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది.14 కిలోమీటర్ల సొరంగంలో 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి అటంకాలు లేవు. లోకో ట్రైన్‌ను వినియోగిం చుకోవచ్చు. ఆ తర్వాత రెండుమూడు అడుగుల వరకూ నీరు నిండి ఉంటోంది. ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డం కిగా మారుతోంది. అందుకే వేగంగా డీవాటరింగ్ చేసి నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు.

ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నల్ బోరింగ్ మిషన్ అవశే షాలు.14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం, సెగ్మెంట్లు కుంగిపోవడం, వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో టన్నల్ బోరింగ్ మిషన్ వెనక భాగం అర కిలోమీటర్ వరకు కొట్టుకు వచ్చింది.సుమారు 15 అడుగుల ఎత్తులో పూడిక : టీబీఎం పూర్తిగా దెబ్బతిని దాన్ని అవశేషాలు సొరంగం నిండా నిండిపోయాయి.

అక్కడి నుంచి ముందుకు సాగాలంటే పక్కనున్న పైపులు, కన్వేయర్ బెల్డ్ ఆధారంగా చేసుకుని సహాయక బృందాలు ముందుకు వెళ్తున్నాయి. అలా కాకుండా టీబీఎం వెనక భాగాన్నంతా గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో కట్ చేసి వేరు చేయాలని నిర్ణయించారు. కొట్టుకు వచ్చిన టీబీఎం తుక్కు భాగాల్లోనూ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

టీబీఎం అవశేషాలను వెలికి తీస్తే ఇక మిగిలింది 100 మీటర్ల వరకూ పేరుకుపోయిన బురద, చివరి 40మీటర్ల ప్రాంతంలో సుమారు 15-20 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన పూడిక. ఈ పూడికను కూడా తొలగించి టీబీఎంకు చేరుకోవాలని సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రణాళిక చేసుకున్నా మని, తక్షణం కార్యాచర ణను ప్రారంభించనున్నట్లు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మేము నిర్ణయం తీసుకు న్నాం. ఇప్పుడు పూర్తిస్థాయి లో డీ వాటరింగ్​ చేయడం జరుగుతుంది. ఇలా డీవాటరింగ్​ చేసి టన్నెల్​ బోరింగ్​ మిషన్​ను గ్యాస్​ కట్టర్​లను ఉపయోగించి కట్​ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్​ఎఫ్​, ర్యాట్​ మైనర్స్​ సర్వీసు వాళ్లను తీసుకొని రెస్య్కూ ఆపరేషన్​ చేస్తాం. ఆ తర్వాత లోపల చిక్కుకున్న వాళ్లను బయటకు తీసు కొస్తాం. ఈ ఆపరేషన్​ మొత్తం కేవలం రెండు రోజుల గడువులో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు…

ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు :మునుగోడు ఎమ్యెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బుధవారం SLBC టన్నెల్‌ను సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరాతీశారు. 8 మందిని రక్షించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా అధికార యంత్రాంగం, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Leave a Comment