
రేపు ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు భేటీ
విస్తృత ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా అమెరికా, ఉక్రెయిన్ అడుగులు వేస్తున్నాయి.
ప్రాథమిక ఒడంబడికపై రేపు(శుక్రవారం) సంతకాలు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రష్యాకు అనుకూలంగా USA వైఖరి మారిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.