
మహా కుంభమేళాకు భారీ ఆదాయం
ప్రయాగ్జ్లో జరిగిన మహాకుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. త్రివేణి సంగమంలో 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ ఆధ్యాత్మిక వేడుక అనేక రికార్డులు సొంతం చేసుకుంది. లక్షల కోట్ల రూపాయల్లో జరిగిన వ్యాపార లావాదేవీలతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సహా, కేంద్ర ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.