H1B Visa: హెచ్1బి వీసా గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయన్నారు. అయితే, సమర్థులు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు. ‘ఈ అంశంపై నాకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి. సమర్థవంతులైన వ్యక్తులు మన దేశంలోకి రావడాన్ని నేనూ ఇష్టపడతాను.
కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా. దేశంల వ్యాపారరంగాన్ని విస్తరించేందుకు మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది హెచ్1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనలనూ సమర్థిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు
అయితే, ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనను వినిపించారు. ‘నేను సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగం రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది.
విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు.