మున్సిపాలిటీ మాకొద్దు పంచాయతి ముద్దు
ప్రజాభిప్రాయల సేకరణలో చిల్లకూరు ప్రజల మనోగతం
చిల్లకూరు గ్రామాన్ని గూడూరు మున్సిపాలిటీలో విలీనం చేసే విషయంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఓ క్లారిటీ ఇచ్చింది. తమ పంచాయతీని మునిసిపాలిటీలోనే కొనసాగించాలని ప్రజలు ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చిల్లకూరు పంచాయతీతో పాటు చెన్నూరు పోటి పాలెం దివి పాలెం పంచాయతీలను మున్సిపాలిటీలో కలుపుతూ జీవో విడుదలైంది అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మున్సిపాలిటీలో చిల్లకూరు పంచాయతీని కలిపే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా చిల్లకూరు ప్రజలు పంచాయితీగా ఉంచాలనే మోగ్గు చూపుతూ ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కలపడం వల్ల ఉపాధి హామీ కింద కూలి పనులు చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి. గూడూరు నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. ఎంపీడీవో గోపి. మాజీ సర్పంచ్ రామ్మూర్తి. టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.