ఉండవల్లి చేరుకున్న అమిత్ షా… సీఎం చంద్రబాబు నివాసంలో విందు
ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా
స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్
అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు, అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
చంద్రబాబు ఆతిథ్యమిస్తున్న ఈ విందు కార్యక్రమానికి కూటమి నేతలు కూడా హాజరు కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజి ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.