పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి
హైదరాబాద్: జనవరి 18
చత్తిస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పూజారి కంకేర్ మారేడు బాక అడవుల్లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు.
మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శి గా పనిచేస్తున్నా బడే చొక్కా రావు ఆలియాస్ దామోదర్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ఈరోజు ప్రకటించింది,
ఛత్తీస్‌గఢ్‌లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతిచెందినట్లు మావో యిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మరణించారు.
దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది.
తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది. ఆరు నెలల క్రితమే ఆయన మావో యిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్‌చార్జిగానూ ఉన్నారు