అమిత్ షా ఏపీ పర్యటనను వ్యతిరేకించండి..
నిరసనలు తెలియజేయండి
అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు;
అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ను అవమానించిన…
రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమన్న వైఎస్ షర్మిల నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని అన్నారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, క్షమాపణలు చెప్పాలని అడగకుండా, అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని పరోక్షంగా చంద్రబాబుపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వారితో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని, కూటమిలోని టీడీపీ, జనసేనలను, అలాగే వైసీపీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే అమిత్ షాతో బహిరంగ క్షమాపణలకు డిమాండ్ చేయాలని ఆమె కోరారు.