సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పని ఒత్తిడిని నుంచి ఉపశమనం కలిగించేలా వారి కి అటవుడుపుగా ప్రతి సంవత్సరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జనవరి 16,17,18 వ తేదీలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.శుక్రవారం ఉదయం జరిగిన టోర్నమెంట్లో గూడూరు మున్సిపల్ జట్టు,ప్రింట్ మీడియా జట్ల మధ్య పోటీ జరిగింది.ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జిఎంసి జట్టు 64 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. అనంతరం 65 పరుగులు గెలుపు లక్ష్యంగా జిఎంసి పై ప్రింట్ మీడియా జట్టు తలపడి విజయం సాధించి సెమీఫైనల్ కు చేరుకుంది. అనంతరం జరిగిన విద్యుత్ శాఖ, న్యాయవాదుల మధ్య జరిగిన టోర్నమెంట్ పోటీలో న్యాయవాదులు విజేతలగా నిలిచారు. మధ్యాహ్నం వాకర్స్, పోలీస్ జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో పోలీస్ జట్టుపై వాకర్స్ జట్టు అత్యధిక పరుగులు సాధించి విజయం సాధించారు. సెమీ ఫైనల్స్ కు ప్రింట్, న్యాయవాదులు, వాకర్స్ జట్లు చేరుకున్నాయి.