52 ఏళ్ల శ్యామల విశాఖ నుంచి కాకినాడకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈది రికార్డు లో ఎక్కారు.
సామర్లకోటకు చెందిన శ్యామల హైదరాబాదులో స్థిరపడ్డారు. వ్యాపారంలో నష్టాలు రావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు. ఏదైనా సాధించాలంటే వయసుతో పనిలేదని నిరూపించారు గోలి శ్యామల.
ఆ ఈతే సాహసంగా మార్ఛుకున్నారు. గతంలో 47 ఏళ్ల వయసులో శ్రీలంక నుంచి రామసేతు వరకు.. గతేడాది మార్చిలో పాక్ జలసంధి 30 కి.మీ దూరాన్ని. లక్షద్వీప్ చానల్ లో ఈతకొట్టి రికార్డులు సాధించారు. తాజాగా 52 ఏళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈది రికార్డులకు ఎక్కారు.
విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ మొత్తం 150 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు శ్యామల. గతేడాది డిసెంబర్ 28న విశాఖపట్నం ఆర్కే బీచ్లో మొదలు పెట్టిన ఈత 2025 జనవరి మూడో తేదీతో పూర్తైంది. రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలీ శ్యామల ఈ రికార్డును పూర్తి చేశారు.