Advertisements

చైనాను వణికిస్తున్న వైరస్‌ పై భారత ప్రభుత్వం ఆదేశాలు..!_

చైనాను వణికిస్తున్న వైరస్‌ పై భారత ప్రభుత్వం ఆదేశాలు..!_

చైనాను వణికిస్తున్న వైరస్‌ పై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చైనాలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ వైరస్ వల్ల.. వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి పై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం… ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్‌ ఫ్లుఎంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్.. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ ఫెక్షన్ లు తీవ్రమయ్యాయి అని పేర్కొంది.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This