Advertisements

అందుకే ఇంటర్‌తోనే ఆపేశాను: విజయవాడ బుక్ ఫెస్టివెల్‌లో పవన్ కల్యాణ్

అందుకే ఇంటర్‌తోనే ఆపేశాను: విజయవాడ బుక్ ఫెస్టివెల్‌లో పవన్ కల్యాణ్

కోరుకున్న చదువు పుస్తకాల్లో లేక చదువు ఆపేశానన్న పవన్ కల్యాణ్

రవీంద్రనాథ్ ఠాగూర్ బాటలో ముందుకు సాగానన్న డిప్యూటీ సీఎం

కోటి రూపాయలైనా ఇస్తా… పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తానని వ్యాఖ్య

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కానీ… క్లాస్‌రూంలో కానీ లేదని, అందుకే ఇంటర్‌తో చదువు ఆపేశానని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ బుక్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

పుస్తకాలు ఉంటే ఇక ఉపాధ్యాయుల అవసరం కూడా ఉండదనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటర్‌తోనే చదువు ఆపేశానని… కానీ పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. తాను చదువుకోలేకనో లేక మార్కులు తెచ్చుకోలేకనో చదువు ఆపలేదన్నారు. బాగా చదివేవాడినని.. కానీ తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్కూల్‌కు వెళ్లకుండానే ఇంటివద్ద నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదివినట్లు చెప్పారు. ఆయన ప్రేరణతో అదే బాటలో ముందుకు సాగానన్నారు.

తనకు తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందన్నారు. తాను ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చేందుకు ఆలోచించను కానీ… పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తానన్నారు. ఎవరికైనా నా పుస్తకం ఇవ్వాలంటే సంపద మొత్తం ఇచ్చినట్లుగా ఉంటుందన్నారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తాను తప్ప తన వద్ద ఉన్న పుస్తకాలను మాత్రం ఇవ్వనని తెలిపారు. తనకు పుస్తక పఠనం అలవాటే లేకుంటే ఏమయ్యేవాడినో అన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This