తిరుపతి జిల్లా గూడూరులో సి.పి.ఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజల జీవితాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్ష నెరవేరే దిశగా సిపిఐ(ఎం) యావత్తు శక్తి వంచన లేకుండా పాటుపడుతూ ఉందని, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవడానికి, రాష్ట్రానికి ఉన్న హక్కులను సాధించుకోవడానికి, మనమంతా సమైక్యంగా పాటుపడదాం, ఆ సమైక్యతను విఘాతం కలిగించే ఏ విద్వేషపూరిత భావోద్వేగాలనూ మన దరి చేరనివ్వవద్దు. ” తెలుగుజాతి మనది – నిండుగ వెలుగు జాతి” మనది అని మనలో ప్రతీ ఒక్కరూ గర్వపడేలా నడుద్దాం. “గడప లోపలే మతం – గడప దాటితే భారతీయులం” అన్న సహోదర భావంతో ముందడుగు వేద్దాం అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కరపత్రాలు గూడూరు పట్టణంలోని ప్రధాన కూడళ్ల ల్లో ప్రజలకు దుకాణదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. సెంటర్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సీనియర్ నాయకులు టి.వెంకటరామిరెడ్డి, బి.వి.రమణయ్య,యస్.సురేష్, అడపాల ప్రసాద్, ముత్యాలయ్య, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.