Advertisements

హెల్మెట్ మీ ప్రాణానికి మీ కుటుంబానికి రక్ష ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

డిఎస్ పి రమణ కుమార్

గూడూరు

ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వల్ల మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా రక్షణ అని గూడూరు సబ్ డివిజన్ డిఎస్పి రమణ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని బైపాస్ సర్కిల్ నందు డిఎస్పి రమణ కుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు టూ వీలర్ నడిపే వాళ్లందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మన కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని మీమీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుందని అది గుర్తెరిగి అందరూ హెల్మెంట్ ధరించాలని ఆయన పిలుపునిచ్చారు గూడూరు బైపాస్ రోడ్డు నుండి ర్యాలీగా బయలుదేరి పట్టణం లోని కోర్టు సెంటర్ వరకు పోయి తిరిగి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ గా వచ్చినారు . ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ డివిజన్ అన్ని స్టేషన్ల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This