Advertisements

అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమాజసం కాదు అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్

సోమవారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సీపీఐ, సిపిఎం నాయకులు కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను రాజ్యసభ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు బాధాకరం అన్నారు. బిజెపి రాజ్యంగా నికి విరుద్ధంగా  ప్రవర్తిస్తుందన్నారు.వెంటనే  అమిత్ షా దేశ ప్రజలందరికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అదేవిధంగా అమిత్ షా ను క్యాబినెట్ నుండి తొలగించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కాలేష, రమేష్, ఎంబేటి చంద్రయ్య, చల్లా వెంకటేశ్వర్లు, జమాల్, బాబు, జోగి శివకుమార్, టీవీ. రామిరెడ్డి, బివి. రమణయ్య, సురేష్, శ్రీనివాసులు, ఏ.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This