నెల్లూరు జిల్లా..కావలి..
మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట సముద్ర తీరంలో మెరైన్ కానిస్టేబుల్ సాహసం నిండు ప్రాణం నిలబడింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు సముద్ర తీరానికి వచ్చారు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు సముద్రంలో ముందుకెళ్లారు. సముద్ర తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న మెరైన్ కానిస్టేబుళ్లు K గోవిందరాజులు S. వేణుగోపాల్ రెడ్డి A. రమేష్ నరేంద్ర చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని రక్షించగా మరో వ్యక్తి మరికొంత లోతుకి వెళ్ళిపోయాడు. ప్రాణాలకు తెగించి గోవిందరాజులు ఆ వ్యక్తిని గట్టుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు సరైన సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడయించారు. యువకుల ప్రాణాలు కాపాడడంతో అక్కడున్న సందర్శకులు మెరైన్ సిబ్బందిని అభినందించారు.