ఇస్రో మరో అద్భుత ప్రయోగం: నింగిలోకి PSLV c60 రాకెట్ ప్రయోగం
హైదరాబాద్:డిసెంబర్ 29
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30 వ తేదీరాత్రి 9.58 గంటలకు పీఎస్ ఎల్‌వీ, సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8.58 గంట లకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేయనున్నారు.
25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ ఎల్ వీ సీ60 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. అయితే, ఈరోజు రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చేరుకోనున్నారు.
ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం.. పీఎస్ ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది ఇస్రో..
కాగా, పీఎస్‌ఎల్‌వీ రాకెట్ 320 టన్నుల బరువు, 44. 5 మీటర్లు ఎత్తు ఉంటుంది. కానీ పీఎస్‌ఎల్‌వీ 60కి స్ట్రాపాన్ బూస్టర్లు లేకపో వడంతో 229 టన్నుల బరు వునే నింగిలోకి వెళ్లనుంది.