నెల్లటూరు చెరువు కట్ట మింద నివాసం ఉంటున్న గిరిజనుల కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ చేసిన కృప సేవా చారిటబుల్ ట్రస్ట్
తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు చెరువు కట్ట మింద నివాసం ఉంటున్న సుమారు 20 కుటుంబాలు గిరిజనులకు, వృద్ధులు, వితంతువులకు ఈ రోజున ఆదివారం 29-12-2024 తేదీన కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు.
సమాజ సేవ లక్ష్యంగా గూడూరు పట్టణానికి చెందిన పడకండ్ల.పురుషోత్తమ రావు. పూర్తి సహకారంతో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా దాత పడకండ్ల.పురుషోత్తమ రావు..జె.వి.వి మాట్లాడుతూ, చలి కాలం, మరియు గత నెల నుండి వర్షాలు కురుస్తుండడంతో చలికి, వర్షాలకు పేద ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రసంశనీయమన్నారు. మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమన్నారు. ఇట్టి కార్యక్రమాలును ఇంకా మరెన్నో చేస్తూ ముందుకెళ్లాలని కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సభ్యులను కోరుకుంటున్నాను అని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు,జాయింట్ సెక్రెటరీ అత్తి మంజరి గోపాల్, పర్వతాల రమేష్, పేయ్యల రమణయ్య, పల్లం గురవయ్య, తుమ్మ తోటి శంకరయ్య, కంట్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు……