Advertisements

31 అర్ధరాత్రి తర్వాత రహదారులపై తిరిగితే చర్యలు తప్పవు ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు

31 అర్ధరాత్రి తర్వాత రహదారులపై తిరిగితే చర్యలు తప్పవు ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు

కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచిస్తూ, సూళ్ళూరుపేట ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో నూతన సంవత్సర రాత్రికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పోలీసుల కఠిన చర్యలు

ఈ నెల 31 రాత్రి పటిష్టమైన పోలీసు పికెటింగ్, రాత్రి గస్తీలు, వాహనాల తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఇంట్లోనే కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

ఆంక్షలు

1. రహదారులపై నిషేధం:

10 అర్ధరాత్రి 12 గంటల తర్వాత రహదారులపై తిరగరాదు.

• బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దు.

• మహిళలు, యువతులపై ఈవ్టీజింగ్ చేయడం నిషేధం.

2. వాహనాల తనిఖీలు:

• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

• లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, త్రిబుల్ రైడింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.

• నిబంధనలను అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటారు.

3. బహిరంగ వేడుకలు నిషేధం:

• బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్లు, డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధం.

• బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించారు.

4. బార్లు మరియు హోటళ్ల ఆంక్షలు:

* మద్యం దుకాణాలు, బార్లు ప్రభుత్వం నిర్ణయించిన సమయాల వరకే తెరవాలి.

10 హోటళ్లు, రెస్టారెంట్లలో నూతన సంవత్సరం వేడుకలకు అనుమతులు లేవు.

*అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎటువంటి సమస్యలు లేకుండా, నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రజలందరూ పోలీసుల నిబంధనలను పాటించాలంటూ ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

You May Like This