కానిస్టేబుళ్ల ఆందోళనపై హోంమంత్రి ఆరా
AP: విశాఖ సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు తమ కుటుంబసభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. తమ డ్యూటీ టైమ్స్ను జైలులోని ఉన్నతాధికారులు 12 గంటలు విధిస్తున్నారని.. ఖైదీల ముందు అవమానిస్తున్నారని ఆరోపిస్తూ.. నిరసనకు దిగారు. దీనిపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనపై నివేదికను మంత్రి కోరారు. జైళ్ల శాఖ విభాగాధిపతితో ఫోన్ చేసి మాట్లాడారు.