గూడూరు మున్సిపల్ పరిధిలోని సర్వీస్ ప్రొవైడర్స్ కు వారి వారి విభాగాల్లో వృత్తి నైపుణ్యత ను పెంచుకునేందుకు మెప్మాా ఆధ్వర్యంలో ఎన్ ఎస్ డి సి ద్వారా శిక్షణ ఇచ్చి అనంతరం సర్టిఫికెట్లు కూడా ఇప్పించి ఉపాది కల్పించేందుకు కృషి చేస్తుందని మె ప్మా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర తెలిపారు.శనివారం
గూడూరు మునిసిపల్ కార్యాలయము లో కమీషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్వీసు ప్రొవైడర్స్ కు ఉపాధి నైపుణ్యం పై అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిధిగా విచ్చేసిన మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ డా రవీంద్ర గారు మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి ఇంటిలో వివిధ రకాల అవసరాలను అందుబాటులో ఉంచేందుకు
ప్రభుత్వము మెప్మాద్వారా
బ్యూటీషియన్ మెన్ /ఉమెన్, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్, ప్లంబర్, ఏసీ మెకానిక్,రిఫ్రీజీరేటర్స్,వాటర్ ప్యూరిఫికేషన్,గీజర్,వాషింగ్ మిషన్,
టివి మెకానిక్ రీపేర్ చేసే వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందిస్తారాన్నారు.
కమీషనర్ మాట్లాడుతూ ప్రాజెక్టు డైరెక్టర్ సూచించిన విధంగా
ఆసక్తి గల సర్వీస్ ప్రొవైడర్స్ వారి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డు , ఆధార్ కార్డు , పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జెరాక్స్ లు తీసుకొని సోమవారం మెప్మా కార్యాలయం నందు సమర్పించి మీ పేరు నమోదు చేసుకోవలయును అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పెంచలయ్య, ఎల్ టి యి ఎల్ హెచ్ ప్రమీల, సి ఓ లుచందన, లత, టీ ఎల్ ఎఫ్ ఓ బి, సర్వీసు ప్రొవైడర్స్ మరియు ఆర్పీ లు తదితరులు పాల్గొన్నారు.