Advertisements

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు… తెలుగువారందరికీ గర్వకారణం: సీఎం చంద్ర‌బాబు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు… తెలుగువారందరికీ గర్వకారణం: సీఎం చంద్ర‌బాబు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై ఎక్స్ వేదిక‌గా స్పందించిన చంద్ర‌బాబు

మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాల‌ని పిలుపు

తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు అద్వితీయ త్యాగం చేశార‌న్న ముఖ్య‌మంత్రి

ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి ఆయ‌న పేరు పెట్ట‌డం అభినందనీయం అన్న సీఎం

విజయవాడలో జ‌రుగుతున్న‌ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని అన్నారు. ఈ సంద‌ర్భంగా మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాల‌ని పిలుపునిచ్చారు.

ఆ లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం అనేది ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం కూడా అభినందనీయం అన్నారు.

ఇక ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులు అందరికీ ముఖ్య‌మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ మహాసభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ… నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave a Comment