శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 385 బుల్లెట్ వాహనాలకు సంబంధించిన సైలెన్సర్ లను రోడ్ రోలర్ సహాయంతో నుజ్జు నుజ్జు చేశారు.
కర్ణకఠోరంగా పసి పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జడుసుకుని ఇబ్బంది పడే ధ్వనులను పుట్టించే ద్విచక్ర వాహనాల ఆగడాలకు బ్రేక్
తల్లిదండ్రులారా… మీ పిల్లల తీరు పట్ల శ్రద్ధ చూపండి…. నేటికీ సరదాగా ఉండేది నాటికి వారి పాలిట విపత్తుగా మారొచ్చు… పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి కానీ దానిని హద్దులో ఉంచండి.
ర్యాష్ డ్రైవింగులను, అధిక శబ్ద కాలుష్యం కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు.
తిరుపతి నగరంలో రోజు రోజుకు శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోంది.
వాహనాలకు అధిక శబ్దం చేసే హారన్ ల పై దృష్టి సారించి జరిమానా విడిస్తున్నము.
అధిక శబ్ద కాలుష్యం చేసే వాహనాలకు sec 190 (class 2), మోటార్ వేహికల్ యాక్ట్ 1988 చట్ట ప్రకారం జరిమానా.
సైలెన్సర్ మార్చే మెకానిక్ వారిపై కూడా కేసు నమోదు చేస్తా
తల్లి దండ్రులు కూడా పిల్లలపై శ్రద్ద చాలా అవసరం.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్.
తిరుపతి నగరం నందు బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్ ఏర్పాటు చేసుకొని శబ్ద కాలుష్యన్ని కలిగిస్తునారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించి, సీజ్ చేసినటువంటి సైలన్సర్ లను రోడ్డు రోలర్ ద్వారా ద్వంసం చేయడం జరిగింది. అంతే కాకుండా వారి వలన ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపిఎస్., వివరించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబెల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించాము. యువత, కాలేజీ విద్యార్ధులు ఫ్యాషన్ లు కొరకు బైక్ లకు షోరూమ్ నుండి రిజిస్టరుగా వచ్చిన సైలెన్సర్ లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తునారు.
యువత తన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది కలిగించకూడదు. యువత బైక్ లపై చూపే శ్రద్ద, స్పీడ్ తన ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై ఆ శ్రద్ధ, స్పీడ్ చూపితే భవిష్యత్తు బంగారుబాట అవుతుంది.
శబ్ద కాలుష్యం వలన మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా, అతిక్రమించడంగా అవుతుంది. అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్ లను అమర్చుకోరాదు. దాని వలన శబ్ద కాలుష్యం అధికంగా ఉండటం వలన రోడ్డుపై ప్రయాణించే ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. ఇందులో మీ చెల్లలు, అక్కలు, తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు అలాగే నివాసాలలో ఉన్నవారు కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు.
మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, దేవాలయాలు, ఇంకా సున్నితమైన ప్రదేశాలు ఉనాయి. ఈ అధిక శబ్దం వలన వాటికి బంగం కలిగించకూడదు.
రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలేన్సుర్లను మార్చకండి దయచేసి తల్లి తండ్రులు కూడా గమనించి ముచ్చట పడకుండా బాద్యత వహించాలి. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో కూడా వృద్దులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు ఉంటె వారికి ఈ సైలెన్సర్ శబ్దం వల్ల ఎంత ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందో ఒక్కసారి గుర్తిచాలన్నారు. మనం ఇతరులకు కలిగించే హాని మనకు ఇతరుల వల్ల హాని జరిగితే ఎలా ఉంటుందో ఉహించండి… ప్రేమైన ఒక్కటే – ప్రాణమైన ఒక్కటే ఏది కొల్పోయిన తిరిగి రాదు, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యాషన్లపై ఉన్న శ్రద్ధ మి ఎదుగుధలమీద చూపించండి ప్రయోజుకులు అవుతారన్నారు.జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూఉంది. బుల్లెట్ వాహనాలు, రేస్ బైకులు కొనుగోలుచేసే వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి త్వరలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. వాహనదారులు ధ్వని కాలుష్యం అతిక్రమణకు పాల్పడకుండా ప్రజలు, యువత ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని అందరు సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని కోరుతున్నాను ఆని అన్నారు.
అదేవిధంగా సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా హెల్మెట్ ధరించే విధంగా ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే చెబుతున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబ భద్రంగా ఉంటుంది మీరు సురక్షితంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది,కాబట్టి అందరూ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి మీ బాధ్యతగా హెల్మెట్ ధరించి రాష్ట్రానికి తిరుపతి జిల్లా ఆదర్శంగా నిలవాలని కోరి ప్రార్థిస్తున్నాను ఆని అన్నారు.అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహణ ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ర్యాలిని ప్రారంభించి, ఎస్పీ గారు కూడా హెల్మెట్ ధరించి వాహనం నడిపారు. ర్యాలీలో పోలిస్ అధికారులు సిబ్బంది, మహిళా విశ్వవిద్యాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు శ్రీ వెంకటేశ్వరరావు అడ్మిన్, శ్రీ రవిమనోహరాచారి L&O, ట్రాఫిక్ డి.యస్.పి రామకృష్ణ ఆచారి, సి.ఐ లు సుబ్బారెడ్డి, సంజీవ కుమార్, యస్.ఐ మరియు సిబ్బంది వారు పాల్గొన్నారు.