Advertisements

లోను EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా

తిరుపతి జిల్లా…

లోను EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా అంటూ సాఫ్ట్వేర్ యువతిని బెదిరించిన ఇద్దరు రికవరీ ఏజెంట్లు అరెస్టు చేసిన సూళ్లూరుపేట పోలీసులు..

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో లోన్ కట్టాలంటూ సాఫ్ట్వేర్ యువతిని వేధింపులకు గురి చేయడంతో ఇద్దరు రికవరీ ఏజెంట్లును పోలీసులు అరెస్టు చేశారు, కేసు వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ జి సుబ్బరాయుడు మీడియాకు తెలియజేశారు..

సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఆరు నెలల క్రితం ఫిన్ బుల్ అనే యాప్ లో లోన్ తీసుకున్నట్లు తెలిపింది, సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో తన ఫోటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించడం తో పాటు యువతి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ లు చేసి దూషించారు, అంతటితో ఆగకుండా యువతి సోదరునికి యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి కొన్ని న్యూడ్ ఫోటోలు కూడా పంపించారు, ఏజెంట్లు వేధింపులు తాళలేక యువతి సూళ్లూరుపేట పోలీసులను ఆశ్రయించింది,స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు అవసరమని ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు, సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫిన్ బుల్ లోన్ యాప్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు, కేసు వ్యవహారంలో నిందితులను అరెస్టు చేయడంలో కోచ్చక్యంగా వ్యవహరించిన సూళ్లూరుపేట SI బ్రహ్మనాయుడు ను పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు…

Leave a Comment