Advertisements

రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దారుణం

రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దారుణం

30న వామపక్షాల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలి

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని సీపీఐ గూడూరు పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇటీవల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 30వ తేదీన సుమారు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి దళితులు , అభ్యుదయవాదులు, లౌకికవాదులు, అంబేద్కర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ నాయకులు మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. సీపీఎం నాయకులు జోగి శివకుమార్, సీపీఐ నాయకులు శశి కుమార్ మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద పాలకులు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఉంటూ ప్రపంచంలోనే గోప్ప రాజ్యాంగమైన భారతదేశ రాజ్యాంగానికి బదులుగా మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ ప్రజల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసే ప్రమాదకర విధానాలను అవలంభించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 30వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు జీ. శశి కుమార్, జోగి శివ కుమార్, షేక్ కాలేషా, పామంజి మణి, గుండాల రమేష్, టీ. వెంకట్రామిరెడ్డి, ఎస్. ముత్యాలయ్య, సురేష్, అడపాల ప్రసాద్, షేక్ జమాలుల్లా, యశ్వంత్, బుడతాటి చంద్రయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment