పుట్టినరోజు సందర్భంగా గురుకుల పాఠశాలకు జంబో షామియానా బహూకరణ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాలకు షామియానా అవసరమని గుర్తించి డాక్టర్ షకీలా మనవరాలు డాక్టర్ బి.యస్.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి.తారక్ నాధ్ రెడ్డి కుమార్తె శ్రేణ పుట్టినరోజు సందర్భంగా 50వేలు విలువ చేసే జంబో షామియానాను గురుకుల పాఠశాలకు బహుమానంగా ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి శ్రేణ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలసి కేక్ కట్ చేసి అందరికి కేక్, చాక్లెట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నారు.
ఈ సందర్భంగా వార్డెన్ కామేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బి.యస్.ఆర్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం శ్రేణ పుట్టిన రోజు సందర్భంగా తమ గురుకుల పాఠశాలకు అవసరమైన వాటిని అందజేస్తారని ఈ సంవత్సరం కూడా పాఠశాల వినియోగం కోసం రూ.50వేలు విలువ చేసే షామియానా బహూకరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు . చిన్నారి శ్రేణ
కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.