తిరుపతి జిల్లా..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్..
- ఆదర్శంగా మేమే ముందుంటాము..హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించిన పోలీసులు..
- తిరుపతి జిల్లా ఎస్పి శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపిఎస్., గారు ప్రజల్లో హెల్మెట్ వాడకం పై విస్టృతంగా చైతన్యం తీసుకురావాలనే ఆదేశాలపై ఈరోజు సాయత్రం విన్నుతంగా సిఐ గారి ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది అందరు హెల్మెట్ ధరించి ర్యాలీగా బయలుదేరి నగరంలొ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత నియమాల లో భాగముగా వాహనదారులు హెల్మెట్ ధరించడం గురించీ ఇచ్చినా అదేశాలతో తిరుపతి రూరల్ మండలంలో ప్రజలకు రోడ్డు సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం పట్ల ప్రజలందరినీ చైతన్యవంతం చేయడమే మా ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ర్యాలీ జరిగింది.
ముందుగా పోలీస్ సిబ్బందితో సాయంత్రం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఎస్పీ గారి ఆదేశానుసారం పోలిస్ సిబ్బంది అందరు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. ప్రతిజ్ఞ చేసుకున్నారు.
ఈ కార్యక్రమం అవిలాల సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి,పట్టణ ప్రధాన వీధుల్లో హెల్మెట్ అవగాహన ర్యాలీ కొనసాగింది.
అనంతరం ప్రజలకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల నివారణపై
రోడ్డు నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చునో వివరించారు.
పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు..